జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు. చిట్యాల విద్యార్థులు ఎంపిక
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు త్రోబాల్ క్రీడలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని అనురాగ్ యూనివర్సిటీలో అక్టోబర్ 4న నిర్వహించిన రాష్ట్రస్థాయి త్రో బాల్ ఎంపిక పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
సబ్‌జూనియర్ బాలికల విభాగంలో కొత్తపల్లి సహస్ర, బాలుర విభాగంలో షేక్ సోను సోహెల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు అక్టోబర్ 30, 31, నవంబర్ 1 తేదీల్లో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించనున్న జాతీయస్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని క్రమశిక్షణతో సాధన చేయాలని, పోటీల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు. జాతీయస్థాయికి ఎంపికైన సహస్ర, సోను సోహెల్‌లను అభినందిస్తూ, వారి భవిష్యత్ క్రీడా ప్రస్థానం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను విద్య అభినందించారు...