BREAKING
thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం thumb ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు.. thumb ● ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి thumb ● ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం thumb ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు.. thumb ● ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి thumb ● ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి సహకరించాలి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:19 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Oct, 2026 - 09:19 PM
9 వీక్షణలు

రైతు సమస్యలను పరిష్కరించాలి.. జాయింట్ కలెక్టర్‌కు బీకేఎస్ వినతి

NTODAY NEWS : చిట్యాల

నల్లగొండ జిల్లా చిట్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా, రుణమాఫీ, సన్నధాన్యానికి బోనస్, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, 24 గంటల విద్యుత్ సరఫరా, పంటల బీమా తదితర హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి అప్పుల భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీకేఎస్ జోనల్ కార్యదర్శి పైళ్ల సత్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏళ్ల అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల వెంకన్న, కార్యదర్శి ఆనగంటి లింగస్వామి, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.