BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు నియోజకవర్గంలో కూటమి క్లీన్ స్వీప్..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:11 PM
33 వీక్షణలు

 గ్రామ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పార్థసారథి గురి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టి కృషితో ఘనవిజయం సాధించాం – మున్సిపల్ చైర్‌పర్సన్, నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలు కైవసం 2029 శాసనసభ ఎన్నికలకు ఈ విజయాలే పునాది – రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లా, నవంబరు 19: నూజివీడు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సాధించిన విజయాలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సమిష్టి కృషి, నాయకులు, కార్యకర్తల సమన్వయంతోనే ఈ ఘనవిజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నూజివీడు రూరల్, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలకు నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కూటమి ఎంపీటీసీ సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారం అనంతరం పూల మొక్కలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారికి అభినందనలు తెలియజేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతమైన పాలన అందించాలని సూచించారు. నూజివీడు రూరల్ మండల ఎంపీపీగా కాపా శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీగా తిరుమారెడ్డి విజయకుమార్, ఆగిరిపల్లి ఎంపీపీగా నక్కబోయిన వేణు, వైస్ ఎంపీపీగా బొడ్డు ధనలక్ష్మి, చాట్రాయి ఎంపీపీగా కొల్లి సత్యవతి, వైస్ ఎంపీపీగా మోదుగమూడి రమేష్, ముసునూరు ఎంపీపీగా అమర్తల ధనలక్ష్మి, వైస్ ఎంపీపీగా తుమండ్రు అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు ఆయా మండలాల ఎంపీటీసీ సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలకు రెండు నెలల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనకు నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపించడమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కేలా చేశారని, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందించిన అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానంతో పాటు నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం సమిష్టి విజయమని అన్నారు. ఈ ఫలితాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేశారని, కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణకు ఇది సంకేతమని అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను గుర్తించిన ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ విజయాలతో మరింత బాధ్యతగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు లక్ష్యంగా కూటమి పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పిస్తూ, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కొత్త ఆలోచనలు, సేవాభావంతో రాజకీయాల్లోకి వస్తున్న యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజలు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, విధ్వంసకర పాలనతో ప్రజలు విసిగిపోయారని, అందుకే 2024 ఎన్నికల్లో కూటమికి భారీ మెజార్టీ అందించారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ప్రజాభిమానం కొనసాగిందని అన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేసి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ విజయ పరంపర 2029 సాధారణ శాసనసభ ఎన్నికలకు బలమైన పునాదిగా నిలుస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి విశ్వాసం వ్యక్తం చేశారు.