BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 03 January 2026, 08:46 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

యాప్ ద్వారా మొబైల్‌లో పూర్తి వ్యవసాయ సమాచారం

తెలంగాణ
03 Jan, 2026 - 08:46 PM
365 వీక్షణలు

రైతులకు APAIMS 2.0 యాప్ ద్వారా మొబైల్‌లో పూర్తి వ్యవసాయ సమాచారం

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు రైతులు తమ వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మొబైల్‌లో పొందేందుకు APAIMS 2.0 యాప్ను ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. APAIMS 2.0 యాప్ ఉపయోగించే విధానం: 1. రైతులు తమ ఆధార్ నంబర్ మరియు ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఉపయోగించి Google Play Store నుంచి APAIMS 2.0 యాప్ను డౌన్‌లోడ్ చేసుకుని రైతు లాగిన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2. ఈ యాప్‌లో రైతులు తమ భూమి ఖాతాల వివరాలను సర్వే నంబర్ వారీగా, అలాగే RSK ఇన్‌చార్జ్‌ల ద్వారా చేసిన పంట బుకింగ్ వివరాలను చూడవచ్చు. 3. రైతులు తాము విత్తిన పంటలను స్వయంగా యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. 4. వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్‌లు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. 5. పంటలపై వచ్చే తెగుళ్లు, వ్యాధులపై ముందస్తు సమాచారం పొందవచ్చు. 6. మార్కెట్ ధరలు యాప్‌లో చూడవచ్చు. 7. వ్యవసాయ శాఖ వార్తలు మరియు ముఖ్యమైన బులెటిన్లు అందుబాటులో ఉంటాయి. 8. RSK ఇన్‌చార్జ్‌ల ద్వారా సర్వే చేసిన పంట నష్టాల వివరాలను రైతులు యాప్‌లో చూడవచ్చు. 9. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాలు, సబ్సిడీ కార్యక్రమాల సమాచారం అందుబాటులో ఉంటుంది. 10. రైతుల RSK ఇన్‌చార్జ్ మరియు మండల వ్యవసాయ అధికారి మొబైల్ నంబర్లు యాప్‌లో ఉంటాయి. రైతులు యాప్ నుంచే వ్యవసాయ శాఖ అధికారులకు నేరుగా కాల్ చేయవచ్చు. పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో APAIMS 2.0 యాప్‌లో రైతుల నమోదు పై శివకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, పుంగనూరు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చదళ్ల గ్రామ వ్యవసాయ సహాయకురాలు ప్రభావతి మరియు రైతులు పాల్గొన్నారు. ఈ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరమైనదిగా ఉండటంతో, ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో కనీసం 300 మంది రైతులను APAIMS 2.0 యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులలో అవగాహన పెంపొందించాలని RSK ఇన్‌చార్జ్‌లు మరియు మండల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆండ్రాయిడ్ మొబైల్ వాడకంపై కనీస పరిజ్ఞానం ఉన్న రైతులు స్వయంగా యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. అవసరమైతే రైతు సేవా కేంద్రం సిబ్బంది సహాయాన్ని పొందవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి రైతు APAIMS 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, రైతులకు ఉపయోగపడే అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఫార్మర్ లాగిన్‌లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. శివకుమార్ A.D. Agriculture (వ్యవసాయ సహాయ సంచాలకులు) పుంగనూరు అన్నమయ్య జిల్లా Follow us on Website Facebook Instagram YouTube