ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మండలి కాంగ్రెస్ అభ్యర్థులు
తెలంగాణ
/
హైదరాబాద్
/
హిమాయత్‌నగర్
హైదరాబాద్: శాసన మండలి కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తమను శాసన మండలి అభ్యర్థులుగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు.