BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:02 pm
Posted by : K MAHESH

కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. అవినీతి పాలన: కేటీఆర్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:02 PM
23 వీక్షణలు

సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శ

  • పెన్షన్లలో 4.70 లక్షల కోతలు.. రూ.4 వేల హామీ ఏమైంది?

  • కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం

  • భూపాలపల్లి నుంచి బీఆర్ఎస్‌లో భారీగా చేరిన నాయకులు, కార్యకర్తలు

హైదరాబాద్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, అవినీతి పాలన అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని బహిరంగంగా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలతో పాలనలోని లోపాలు బయటపడుతున్నాయని అన్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పనులు జరగాలంటే పర్సంటేజీలు ఇవ్వాల్సి వస్తోందని చెబుతుండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి, కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

ప్రభుత్వం నుంచి నియోజకవర్గాలకు నిధులు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకు అర్జీలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని, అందుబాటులో ఉన్న నిధులన్నీ కొడంగల్‌కు తరలిస్తున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాము కేవలం పెళ్లిళ్లు, చావులకు మాత్రమే పరిమితమయ్యామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఆ పార్టీ నేతలే గళం విప్పుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆరోపణలు, కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 44 లక్షల 70 వేల పెన్షన్లు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది 1.50 లక్షలు, రెండో ఏడాది మరో 1.50 లక్షలు, మూడో ఏడాది 1.70 లక్షల పెన్షన్లు తొలగించిందని, మొత్తంగా 4.70 లక్షల పెన్షన్లకు కోత పెట్టిందని విమర్శించారు. మరోవైపు కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేసిందని, తొలగించిన వాటితో పోలిస్తే కొత్తగా ఇచ్చినవి ఏడు వేల తక్కువగా ఉన్నాయని వివరించారు.

పెన్షన్లు పెంచామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, వాస్తవంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని ఆరోపించారు. పెన్షన్ల బడ్జెట్ కూడా పెరగలేదని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియకుండా ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్‌లో రూ.2 వేలు, డిసెంబర్ నుంచి రూ.4 వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ, మూడు డిసెంబర్లు గడిచినా ఇప్పటికీ రూ.2 వేలే అందుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న మొత్తం కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినదేనని, కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని ఒక్క రూపాయి కూడా పెంచలేదని మండిపడ్డారు.

వృద్ధులు, వికలాంగులు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి, భట్టి విక్రమార్క అఫిడవిట్‌తో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. గ్యారంటీ కార్డులను క్రెడిట్ కార్డుల్లా భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన నాయకులు, హామీలను అమలు చేయలేకపోయారని విమర్శించారు.

అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.15 వేలు ఇచ్చి ప్రజలను కొనుగోలు చేయవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. డబ్బులు పంచితే ప్రజలు తనకే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏడాది తర్వాత వచ్చేది గులాబీ జెండానేనని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును, రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి వెనుక పరుగులు తీసిన ఘటనను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. బీజేపీలోనూ ఢిల్లీ నాయకుల పట్ల ఇదే ధోరణి కనిపిస్తోందని, అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాష్ట్ర నాయకులు వ్యవహరించిన తీరును ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి ప్రాంతంలో కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ గుర్తుచేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్యను 32కు పెంచామని, తద్వారా వేలాది మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే అవకాశం కల్పించామని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దలను ప్రశ్నించకుండా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని, అధిష్ఠానానికి చెల్లించాల్సిన ఈఎంఐలు కట్టకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందంటూ వ్యాఖ్యానించారు. అందుకే ఆయనను రెగ్యులర్ ముఖ్యమంత్రి కాకుండా 'రెన్యువల్ ముఖ్యమంత్రి' అని పిలుస్తున్నానని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతుందని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.