BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:13 pm
Posted by : K MAHESH

అన్నపూర్ణ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:13 PM
9 వీక్షణలు

బయ్యారం, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గుర్రం అన్నపూర్ణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గంధంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తపేటలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అంతిమయాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నపూర్ణ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బయ్యారం మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, గంధంపల్లి, కొత్తపేట గ్రామశాఖ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావురి రామచంద్రయ్య, నందగిరి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.