BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:29 am
Posted by : K MAHESH

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:29 AM
27 వీక్షణలు

గాంధీ సెంటర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు.. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

బయ్యారం, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా బయ్యారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బయ్యారం మాజీ ఎంపీపీ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి, పీఏసీఎస్ చైర్మన్ బండారు మల్లయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దినేని వెంకటేశ్వర్ రావు, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంబాల ముసలయ్య, ఉప సర్పంచ్ ఏనుగుల ఉమా, పీఏసీఎస్ డైరెక్టర్ నద్దునూరి యశోద, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, రంజిత్, లింగయ్య, వార్డు సభ్యులు బట్టు ఉమా, శీలం సరోజన, నందగిరి భద్రయ్య, తగిర సత్తిరెడ్డి, మండ రేణుక, తాటి జనార్ధన్, పులి మల్లయ్య, ఆకునూరి సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, పెద్దబుజ్జి, నందిపాటి భవాని, బిళ్లకంటి వెంకన్న, గుగ్గిళ్ల వెంకటయ్య, జలిక శ్రీకాంత్, చల్ల గోవర్ధన్, కత్తి రాధాకృష్ణ, పందిరి విద్యాసాగర్, జాన్ పాస్టర్, భీమనపల్లి యాదగిరి, నిమ్మల సోమిరెడ్డి, సింగు రామనర్సయ్య, చల్ల వెంకన్న, యాప సందీప్, కోరం వంశీ, కల్తీ బాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.