BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 09:56 am
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

కోరుకొండ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపుపై వివాదం.. రీకౌంటింగ్ కోసం వైఎస్సార్‌సీపీ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
08 Nov, 2026 - 09:56 AM
22 వీక్షణలు

జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన

రాజమహేంద్రవరం (ఎన్ టుడే న్యూస్):

కోరుకొండ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శనివారం ఆందోళనకు దిగారు.

రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో మొదట వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 800కు పైగా ఓట్ల ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైందని, చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించడంపై అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు.

ఓట్ల లెక్కింపులో చోటుచేసుకున్న పరిణామాలపై జక్కంపూడి రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి తమకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.