BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 03:58 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

గణేష్ నిమజ్జన ఉత్సవాలపై సమన్వయ సమావేశం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
22 Sep, 2026 - 03:58 PM
14 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చర్చించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై సమీక్షించారు.

గణేష్ నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఉత్సవ కమిటీలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఎస్పీ ప్రకాష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల ఎంఆర్‌ఓ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా ఐఎన్‌టీయూసీ ప్రతినిధి పూదరి తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.