BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు
Test 4
Date of Publish : 25 September 2026, 04:18 pm
Posted by : M. రాజశేఖర్

నులిపురుగుల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
25 Sep, 2026 - 04:18 PM
75 వీక్షణలు

కొత్తిండ్లు హైస్కూల్‌లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

కొత్తిండ్లు: కొత్తిండ్లు హైస్కూల్‌లో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేసి, నులిపురుగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా మాట్లాడుతూ.. పిల్లల్లో నులిపురుగుల కారణంగా కడుపునొప్పి, ఆకలి తగ్గడం, బలహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వైద్య సిబ్బంది సూచనల మేరకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్యను నివారించవచ్చని వివరించారు.

పిల్లలు భోజనం చేసే ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత, బయట మట్టిలో ఆడుకున్న తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. మట్టిలో చెప్పులు లేకుండా తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బయట ఆడుకున్న అనంతరం చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.

గోళ్లను చిన్నగా ఉంచుకోవడం, శుభ్రమైన నీటిని తాగడం, కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి తీసుకోవడం వంటి పరిశుభ్రత అలవాట్లను పాటించాలని సూచించారు.

పోషకాహారంపై అవగాహన

పిల్లల్లో రక్తహీనత సమస్యను నివారించేందుకు ఇనుము, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. ఆకుకూరలు, పప్పులు, కాయధాన్యాలు, గుడ్లు, పాలు తదితర పోషకాహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని వివరించారు.

రక్తహీనత కారణంగా అలసట, బలహీనత, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, ఇవి పిల్లల చదువుపై కూడా ప్రభావం చూపవచ్చని తెలిపారు.

పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన పరిసరాలు, పోషకాహారం, నులిపురుగుల నివారణ చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని డాక్టర్ సుభాష్ రాజా సూచించారు.

కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా, ఏఎన్‌ఎం బేవిరాణి, ఆశా వర్కర్లు, ఎంఎల్‌హెచ్‌పీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.