BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 11:18 pm
Posted by : ఈడూరి డేవిడ్

P4 విధానంలో రూ.24 లక్షల విలువైన వాహనాలు అందజేత

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
02 Sep, 2026 - 11:18 PM
96 వీక్షణలు

దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రెండు బొలెరో నియో వాహనాలు

రాజమహేంద్రవరం | Ntoday News

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 విధానంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రెండు మహీంద్రా బొలెరో నియో వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం విలువ రూ.12 లక్షలు కాగా, రెండు వాహనాల మొత్తం విలువ రూ.24 లక్షలుగా ఉంది.

రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ సమక్షంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు వాహనాలను పోలీస్ శాఖకు అందజేశారు.

గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు అందజేసిన బొలెరో నియో వాహనాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు, గోపాలపురం మండల నాయకులు, ఎమ్మెల్యే సౌజన్యంతో సమకూర్చారు. అదే విధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు అందజేసిన మరో వాహనాన్ని పరమేశు బయోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ సంస్థ సౌజన్యంతో అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు అవసరమైన వాహనాలు సమకూరడం ద్వారా అధికారులు, సిబ్బంది మరింత వేగంగా విధులు నిర్వహించేందుకు వీలవుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో సత్వర స్పందనతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు కలిసి పనిచేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, ఎస్‌బీ డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, దేవరపల్లి సర్కిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.