BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 02 September 2026, 01:25 pm
Posted by : THOTA VENKATA KRISHNA

అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
02 Sep, 2026 - 01:25 PM
38 వీక్షణలు

కుక్కునూరులో పూజలు, అర్చనలు.. కేక్ కట్ చేసి పాలాభిషేకం

కుక్కునూరు | Ntoday News

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను కుక్కునూరు మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం కుక్కునూరు మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్‌లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో కుక్కునూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్‌తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగు, బీజేపీ నాయకుడు లక్ష్మణ చార్యులు, ఉపాధ్యక్షులు వెంకన్న బాబు, గంధం నాగరాజు, తోట వినోద్, అవుల శ్రీను, ధనస్వామి, సీతారామయ్య, నూక వినోద్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.