BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 01:16 PM
70 వీక్షణలు

భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు న్యూపాలెస్ సెంటర్‌లో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉందనే సందేశాన్ని చాటుతూ భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లింగినేని సుధాకర్ (న్యాయవాది), పసుపులేటి రవీంద్ర, రామిశెట్టి జగన్, నామా నాగరాజు, నల్లగర్ల బద్రీ, బచ్చే మేస్త్రి తదితరులతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.