BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 01:48 pm
Posted by : DAVU RAVINDER REDDY

GHMCలో రూ.70 కోట్ల డబుల్ బిల్లులు

తెలంగాణ
/ హైదరాబాద్
02 Sep, 2026 - 01:48 PM
61 వీక్షణలు

102 మంది కాంట్రాక్టర్లకు రెండుసార్లు చెల్లింపులు.. 12 మంది నుంచి రూ.7 కోట్లు రికవరీ

హైదరాబాద్ | Ntoday News

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో భారీగా డబుల్ బిల్లుల చెల్లింపులు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 102 మంది కాంట్రాక్టర్లకు సుమారు రూ.70 కోట్ల మేర రెండుసార్లు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

విషయం వెలుగులోకి రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 12 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లను తిరిగి వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఈ వ్యవహారంలో బాధ్యత వహించినట్లు భావిస్తున్న ఆడిట్ శాఖ అధికారి శరత్ చంద్రపై చర్యలు తీసుకుని వేటు వేసినట్లు సమాచారం.

కాగా, డబుల్ బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.