BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 02 September 2026, 11:00 am
Posted by : NTODAY NEWS

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
02 Sep, 2026 - 11:00 AM
182 వీక్షణలు


శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ మండల కన్వీనర్ తనకంటి జయప్ప, టౌన్ కన్వీనర్ యు. సుధాకర్ రాజు, సురేందర్ రెడ్డి, కందుకూరుపల్లి నాగరాజు, పేరవాండ్లపల్లి ఎస్. పాల్ కొండారెడ్డి, కాజాపీర్‌పల్లె మణికంఠ తదితర వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు