రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons
రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons
..ఛలో వెలుగోడు రిజర్వాయర్... సాగునీరు, త్రాగునీటి జలాల కోసం వైసీపీ యుద్ధం.... వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను రైతులను నిర్బందించిన పోలీసులు...తగ్గేదే లేదంటున్న శిల్పా చక్రపాణి రెడ్డి..
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో రైతు శంఖారావానికి పోలీసులు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించి అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, శిల్పా కార్తీక్ రెడ్డి, నందికొట్కూరు ఇంచార్జ్ డా. ధారా సుధీర్, రాష్ట్ర రైతులతో తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థి నెలకొన్నది. సాగునీరు త్రాగునీరు సాధనకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా గ్రామల నుండి రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్ లతో తరలి వస్తుండగా వారిని ఎక్కడికక్కడే నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు. రైతులపై కేసులు పెడతామని, ట్రాక్టర్లను సీజ్చేస్తామని ప్రభుత్వ అధికారులు బెదిరించినా రైతులు వెలుగోడు ముట్టడికి కథం తొక్కారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్ పి పి నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, గంగుల బిజేంద్రా రెడ్డి, వైసీపీ నేతలు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి రైతు విభాగం నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, వైసీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటాసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డిలు మాట్లాడుతూ... వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి వెళ్తే రైతులపై కేసులు పెడతామని భయబ్రాంతులకు గురిచేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా వారు ఎక్కడా వెనుకంజవేయలేదని వారి ఆవేదన ప్రభుత్వానికి తెలియజేసేందుకు తరలిరావడం జరిగిందన్నారు. కలెక్టర్ నీరు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రోడ్లపై నిరసన తెలియజేయడం జరిగింది. 11 టీఎంసీల వాటా నీరు వస్తే త్రాగేందుకు 5టీఎంసీలు, కేసీ కెనాల్ కు 6టీఎంసీలు నీరు అందించే అవకాశం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రైతులకు అన్యాయం జరుగుతుంటే తెలుగుదేశం నాయకులు ఒక్కరుకూడా నోరు మెదపలేదని ఇది దురదృష్టం అన్నారు. సాగునీరు త్రాగునీరు అందిస్తే ఉద్యమాలు చేయాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. పోలీసులు తమను ఎన్నిసార్లు అడ్డుకున్నా భయపడే ప్రసక్తేలేదు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తేలేదన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి.
వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసుల ఆంక్షలకు గానీ, లాఠీలకు గానీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. "రైతులకు సాగునీరు, తాగునీరు అందించేంతవరకు మా పోరాటం ఆగదు. అన్నదాతల హక్కుల కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం" అని స్పష్టం చేశారు. "సాగునీరు... త్రాగునీరు... మా హక్కు!మా గొంతులు ఎండిపోతున్నాయి...నీటిని విడుదల చేసి మా గొంతుల్ని, మా పొలాల్ని తడపండని!".... మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కోరారు. "మా నంద్యాల జిల్లా ప్రజల త్యాగాలు, భూదానాల ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మిస్తే... ఈ రోజు అదే ప్రాజెక్టు పక్కనున్న మా రైతులు సాగునీరు, త్రాగునీరు కోసం రోడ్లెక్కి అడుక్కోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఈ ప్రాజెక్టు? నాగార్జున సాగర్‌కు నీళ్లిస్తారు... విద్యుత్ ఉత్పాదనకు వాడతారు... తెలంగాణకు, కృష్ణా డెల్టాకు తరలిస్తారు... కానీ, ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రాయలసీమ బిడ్డలకు మాత్రం ఒక్క బొట్టు నీరివ్వరా? ఇది దుర్మార్గం కాదా?" అని ప్రశ్నించారు. "'అన్నదాత సుఖీభవ' అని ప్రకటనలు చేసే ఈ కూటమి ప్రభుత్వం... నేడు అదే అన్నదాత కళ్లల్లో కన్నీరు తెప్పిస్తోందిని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు... రాయలసీమ రైతుల కన్నీళ్లు మీ కళ్లకు కనిపించడం లేదా? అని సూటిగా పేర్కొన్నారు. శ్రీశైలానికి నీళ్లు వచ్చినా, మా కాలువల్లో, చెరువుల్లో ఎందుకు నీళ్లు లేవు? మీకు వెలుగొండ కనిపించింది కానీ... ఈ వెలుగోడు ముఖద్వారం ఎందుకు కనిపించలేదా?" అన్నారు. రైతన్నలారా... కళ్లు తెరవండి! మన నీరు... మన హక్కు! ఇది అడిగితే వచ్చేది కాదు... పోరాడి సాధించుకోవాల్సిందని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం నీళ్లివ్వకపోతే... ఈ ప్రభుత్వ మెడలు వంచి అయినా సరే మన నీటిని మనం సాధించుకుందామన్నారు. కేసులు పెడతారా? పెట్టుకోండి... కేసులకు భయపడే ప్రసక్తే లేదనిరైతులలో ధైర్యం నింపారు శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు తెలంగాణాకు ముఖ్యమంత్రా లేదా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రా అర్థం కావడంలేదని కాటసాని రామిరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీశైలంలో 170 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని మన వాటాకు నీటిని విడుదల చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు రైతులకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు సీఎంతో మాట్లాడేందుకు చొరవ చూపడంలేదో తెలియాల్సి ఉందన్నారు. వారు మూగవారిగా అయ్యారన్నారు.