BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 02 September 2026, 07:39 am
Posted by : కూనురు మధు

నేరడలో ప్రభుత్వ భూమిని కాపాడాలి.. సమగ్ర విచారణ జరిపించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Sep, 2026 - 07:39 AM
62 వీక్షణలు

నేరడలో ప్రభుత్వ భూమిని కాపాడాలి.. సమగ్ర విచారణ జరిపించాలి

సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలి.. తహసీల్దార్, ఎస్‌ఐలకు బీజేపీ నాయకుల వినతి


చిట్యాల మండలం నేరడ గ్రామంలో సర్వే నంబర్ 292లోని భూమికి సంబంధించి వస్తున్న ఆక్రమణ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని బీజేపీ నాయకులు కాసోజు శంకరాచారి కోరారు. ఈ మేరకు చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయం తో పాటు చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. నేరడ గ్రామపంచాయతీ సమీపంలో నేరడ–గాదిరెడ్డిపల్లి ప్రధాన రహదారి పక్కన సుమారు ఎకరం 20 గుంటల భూమిపై ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. సదరు భూమిలో ‘సేవ ప్లేస్ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం’ పేరుతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు కూడా తెలిపారు. అయితే సదరు భూమి ప్రభుత్వ భూమా, వ్యక్తిగత యాజమాన్యంలోని భూమా అనే విషయం అధికారిక రికార్డుల పరిశీలన ద్వారా నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు. సంబంధిత రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలు, పట్టాదారు వివరాలు, భూమి హద్దులు, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించి వాస్తవాలను తేల్చాలని తహసీల్దార్‌ను వినతి పత్రంలో  పేర్కొన్నారు. భూమి ప్రభుత్వానికి చెందినదిగా విచారణలో నిర్ధారణ అయితే, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు లేదా ఇతర నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో తేలితే, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, భూమి ఆక్రమణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసు అధికారులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు వాస్తవమని దర్యాప్తులో తేలిన పక్షంలో బాధ్యులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సదరు భూమిలో కొత్త నిర్మాణాలు లేదా ఇతర కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.నేరడ గ్రామంలో పేద కుటుంబాలు ఇంటి స్థలాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాల్సిన అవసరం ఉందని కాసోజు శంకరాచారి పేర్కొన్నారు.


ఈ అంశాన్ని అధికారులు సుమోటోగా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలని కోరారు. ఉన్నఫలంగా చర్యలు తీసుకోకపోతే   గ్రామస్తులతో కలిసి  ప్రహరి గోడలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు కాసోజు శంకరాచారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీనివాస్ యాదవ్, మంద వేణుగోపాల్‌రెడ్డి, మిర్యాల మురళీకృష్ణ, శ్రీరామోజు నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.