BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 01 September 2026, 07:55 am
Posted by : P. KISHORE

వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
01 Sep, 2026 - 07:55 AM
60 వీక్షణలు

వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 

చిత్తూరు జిల్లా పోలీసు

చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో వాహనాల తనిఖీలు – ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన - ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామచంద్ర

చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలోని పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల RVS నర్సింగ్ కాలేజీ వద్ద చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామచంద్ర వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు.

అలాగే వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని వివరించారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు, విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.