BREAKING
కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..
Date of Publish : 01 September 2026, 09:41 am
Posted by : BOYA SWAMY

ఉరుమడ్లలో మత్తు పదార్థాల విక్రయాలపై హెచ్చరిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
01 Sep, 2026 - 09:41 AM
18 వీక్షణలు

ఉరుమడ్లలో మత్తు పదార్థాల విక్రయాలపై హెచ్చరిక

కిరాణా, బెల్ట్‌ షాపుల యజమానులకు గ్రామపంచాయతీ సూచనలు

నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఉరుమడ్ల | సెప్టెంబర్ 1, 2026

ఉరుమడ్ల గ్రామంలో మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని కిరాణా దుకాణాలు, బెల్ట్‌ షాపుల యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేసింది.

గ్రామంలోని దుకాణాల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే కాకుండా 20 సంవత్సరాల లోపు యువతకు కూడా గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు, మద్యం, వైన్ తదితర మత్తు పదార్థాలను విక్రయించరాదని గ్రామపంచాయతీ సూచించింది.

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి మైనర్లు లేదా యువతకు మత్తు పదార్థాలు విక్రయించినట్లు తెలిసినా, నిర్ధారణ అయినా చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అలాగే గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉరుమడ్లలో మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం, ఇతర మత్తు పదార్థాల విక్రయాలను నియంత్రించేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది.

కిరాణా, బెల్ట్‌ షాపుల యజమానులందరూ గ్రామపంచాయతీ సూచనలను పాటిస్తూ మత్తు పదార్థాల విక్రయాలను ప్రోత్సహించకుండా సహకరించాలని కోరారు. ముఖ్యంగా 20 సంవత్సరాల లోపు యువతకు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలు విక్రయించవద్దని స్పష్టం చేశారు.

యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గ్రామంలో నెలకొల్పేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.

— ఉరుమడ్ల గ్రామపంచాయతీ పాలకవర్గం