BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 31 August 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:53 PM
55 వీక్షణలు

పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలోని శ్రీ నీలాద్రిశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పరాభవ నామ సంవత్సరం శ్రావణమాసం తదియ సందర్భంగా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా సత్తుపల్లి వాసి రామ్ సాయి స్వామివారి ప్రసాదాల తయారీ కోసం 25 కిలోల బియ్యం విరాళంగా అందించారు. తిరువూరు వాసి మల్లెల శ్రీనివాస్ స్వామివారి దీపారాధన కోసం 5 కిలోల నువ్వుల నూనెను సమర్పించారు.

ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.