BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 04:57 pm
Posted by : DAVU RAVINDER REDDY

వినాయక విగ్రహాల ధరలకు రెక్కలు.. 20 అడుగుల మూర్తి రూ.లక్షకు పైగానే

తెలంగాణ
01 Sep, 2026 - 04:57 PM
55 వీక్షణలు

హైదరాబాద్: వినాయక చవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక విగ్రహాల తయారీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ధూల్‌పేట్‌తో పాటు హైదరాబాద్ శివార్లలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాల తయారీదారులు 5 అడుగుల నుంచి 30 అడుగుల వరకు భారీ మట్టి, ఇతర పదార్థాలతో తయారు చేసిన వినాయక మూర్తులను సిద్ధం చేస్తున్నారు.

పండుగకు సమయం దగ్గరపడటంతో విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ ఆకృతులు, అలంకరణలు, రంగులతో ప్రత్యేకంగా రూపొందించిన విగ్రహాలు భక్తులను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నారు.

అయితే ముడిసరుకుల ధరలు, విగ్రహాల తయారీకి అవసరమైన సామగ్రి, కార్మికుల కూలీలు, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది విగ్రహాల ధరలు కూడా పెరిగినట్లు తయారీదారులు చెబుతున్నారు.

ప్రస్తుతం 20 అడుగుల వినాయక విగ్రహం ధర రూ.లక్షకు పైగానే పలుకుతోంది. విగ్రహం ఎత్తు, రూపురేఖలు, ఉపయోగించే ముడిసరుకులు, రంగులు, అలంకరణలు, ప్రత్యేక డిజైన్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.

పెద్ద విగ్రహాలకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు వచ్చి తమకు కావాల్సిన ఆకృతులు, పరిమాణాల్లో విగ్రహాలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారని తయారీదారులు పేర్కొన్నారు.