BREAKING
thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు
Date of Publish : 01 September 2026, 12:53 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు

జాతీయం జాతీయం
01 Sep, 2026 - 12:53 PM
78 వీక్షణలు

సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు: ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు - 1995 సెప్టెంబర్ 1న మొదలైన చంద్రబాబు అభివృద్ధి ప్రస్థానం.. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన విజన్.. అమరావతిని ప్రపంచ నగరంగా మలిచే సంకల్పం

- చంద్రబాబు తొలి ప్రమాణ స్వీకార దినం.. అభివృద్ధి యుగానికి నాంది..సాంకేతిక విప్లవానికి శ్రీకారం..

- నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూపకల్పన సెప్టెంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలనా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. 1995 సెప్టెంబర్ 1న శ్రీ నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజును జీవీ గుర్తు చేసుకున్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని ఆధునిక, సాంకేతిక, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది, లక్షల ఉద్యోగాలు సృష్టించిన దార్శనికనేత అని జీవీ ఆంజనేయులు కొనియాడారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను ఐటీ, సాంకేతిక రంగాల అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రపంచం దృష్టిని ఆకర్శించాయని  పేర్కొన్నారు.

హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి ఆధునిక నగరాభివృద్ధి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఐటీ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం, మౌలిక వసతులను విస్తరించడం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని జీవీ అన్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు ఆకర్షించడం ద్వారా నగరానికి ప్రపంచస్థాయి టెక్నాలజీ గుర్తింపు మరింత పెరిగిందని తెలిపారు 

2014లో రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి కొత్త రాష్ట్ర నిర్మాణానికి పునాదులు వేశారని  అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలన్న సంకల్పంతో ముందుకు సాగారని తెలిపారు. అమరావతిని ఆధునిక, పచ్చదనం, సాంకేతికత, మౌలిక వసతులతో కూడిన భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 

హైదరాబాద్‌లో హైటెక్ సిటీ - సైబరాబాద్ నిర్మాణానికి దారితీసిన విజన్ నుంచి అమరావతిని క్వాంటమ్ వ్యాలీ, భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన వరకు చంద్రబాబు అభివృద్ధి ప్రస్థానం కొనసాగుతోందని అన్నారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తరాలకు మెరుగైన మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, సాంకేతిక ప్రగతి అందించడమే లక్ష్యంగా అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు సాగడానికి సీఎం చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని జీవీ ఆకాంక్షించారు.