BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 01 September 2026, 02:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ 8వ ఆవిర్భావ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 02:55 PM
66 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం: తిరువూరులోని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

రీజియన్ సెక్రటరీ బి.ఎల్.హెచ్. ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బ్యాంకు ఖాతాదారులు, శ్రేయోభిలాషులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

బ్యాంకు కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించి వారి సేవలను అభినందించారు.

కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ రాజేష్ కుమార్, అకౌంటెంట్ ఫిరోజ్ బేగం, ఫీల్డ్ ఆఫీసర్ హేమ, క్యాషియర్లు ధారవతు శ్రీను, తిరుమల ప్రసాద్, విజయకుమార్ వాణి, బాలకృష్ణారెడ్డి, శ్రావణి, ఆర్మ్డ్ గార్డ్ అప్పలరాజు, నికిత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రీజియన్ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ 8వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ సిద్ధాంతాలను గౌరవిస్తూ, నిబంధనలను పాటిస్తూ మాతృసంస్థ అయిన ఎస్‌బీఐను మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సభ్యులంతా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ నిత్యం చైతన్యవంతంగా సేవలు అందించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూనియన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు, బ్యాంకు ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు.