BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 31 August 2026, 08:17 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
31 Aug, 2026 - 08:17 PM
39 వీక్షణలు

ఎల్కతుర్తి: 22-ఏ జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఎల్కతుర్తి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సిద్దిపేటకు చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 22-ఏ జీవో కారణంగా ప్రజలు తమ భూములకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల భూములను కాపాడేందుకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని నాయకులు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ మహాధర్నాలో ఎల్కతుర్తి మండలానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.