BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో మ్యాట్రిస్‌-4 డ్రోన్‌తో పోలీసుల ఈగల్ ఛాలెంజ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:52 PM
51 వీక్షణలు

మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక నిఘా.. అపోహలు కాకుండా ఆధారాలతో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మాదకద్రవ్యాల నియంత్రణకు తిరువూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజయవాడ కమిషనరేట్ సీపీ ఎస్‌వీ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ మార్గదర్శకత్వంలో, మైలవరం ఏసీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సోమవారం మ్యాట్రిస్‌-4 డ్రోన్‌ ద్వారా నిఘా కార్యక్రమం నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని ఎస్‌ఆర్ టవర్స్, చీరాల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్‌ సాయంతో పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై సమాచారం సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఈగల్ ఛాలెంజ్‌లో భాగంగా..

గంజాయి లేదా ఇతర నిషేధిత మాదకద్రవ్యాలు వినియోగించే వారు, విక్రయించే వారి గురించి కచ్చితమైన సమాచారం అందించాలని పోలీసులు కోరారు. విశ్వసనీయ సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.

“బ్లేడ్ బ్యాచ్.. గంజాయి బ్యాచ్..” అంటూ ఆధారాలు లేకుండా ఎవరిపైనా అపోహలు కల్పించవద్దని సూచించారు. మద్యం సేవించే వారిని మాదకద్రవ్యాల వినియోగదారులుగా భావించవద్దని, వాస్తవ ఆధారాలతో మాత్రమే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అపోహలు వద్దు.. ఆధారాలు కావాలి.. సమాచారం మీది.. చర్య మా బాధ్యత అంటూ తిరువూరు పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.