BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 31 August 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలవల్లి గ్రామంలో ముసునూరు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:16 PM
92 వీక్షణలు

చింతలవల్లి గ్రామంలో ముసునూరు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీల ఎన్నిక

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ముసునూరు మండలం: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీల నిర్మాణ సమావేశం నిర్వహించారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి ముసునూరు మండలం ఇన్‌చార్జి అధ్యక్షులు దుబ్బాకు దేవరాజు మాదిగ అధ్యక్షత వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎంఎస్పీ ఉపాధ్యక్షులు ముళ్లపూడి వెంకటేశ్వరరావు మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ బలోపేతంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన మండల కమిటీల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేపట్టిన సామాజిక న్యాయ పోరాటాలు, ఎమ్మార్పీఎస్ సాధించిన విజయాలను వివరించారు.

నూజివీడు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బాకు దేవరాజు మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ సాధించిన విజయాలు, భవిష్యత్తులో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టనున్న పోరాటాలపై వివరించారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అనంతరం ముసునూరు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు.

ముసునూరు మండల ఎమ్మార్పీఎస్ కమిటీ:

అధ్యక్షులుగా మద్దాల బాబురావు మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షులుగా దువ్వూరి లక్ష్మణరావు మాదిగ ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా ముళ్లపూడి రాము మాదిగ, గొల్లపల్లి ప్రసన్నకుమార్ మాదిగ, ఎంఎస్పీ ఉపాధ్యక్షులుగా మద్దాల మురళి మాదిగ, మేడూరి రవి మాదిగ, కుమ్ముకూరి రాంబాబు మాదిగ, సోంగా అంజయ్య మాదిగలను ఎన్నుకున్నారు.

ప్రధాన కార్యదర్శిగా పల్లిపాము సతీష్ మాదిగ, ఎంఎస్పీ బాధ్యతల్లో గండిపూడి బాబురావు మాదిగ, అధికార ప్రతినిధులుగా పల్లి శివరామ్ మాదిగ, పొదిల రాంబాబు మాదిగ, ప్రచార కార్యదర్శులుగా సోదిమెళ్ల సాయి చందు మాదిగ, కోశాధికారులుగా ముళ్లపూడి సజయ్ మాదిగ, కంకట వెంకటరత్నం మాదిగలను నియమించారు.

కార్యవర్గ సభ్యులుగా లక్కపాము సుధాకర్ మాదిగ, కొడవలి సతీష్ మాదిగ, తేనేటి రమేష్ మాదిగ, గొడవర్తి రవి మాదిగ, ముదునూరి శేషగిరి మాదిగ, కుమ్ముకూరి రాజా మాదిగ, పల్లిపాము చిట్టిబాబు మాదిగ, పల్లి కిషోర్ బాబు మాదిగలను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాకు దేవరాజు మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు కలపాల విలియమ్స్ మాదిగ, ముసునూరు మండల మాజీ అధ్యక్షులు పల్లి కనకయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి డోలా ఆనంద్ మాదిగ, పల్లిపాము కుటుంబరావు మాదిగ, చింతలవల్లి గ్రామ మాజీ సర్పంచ్ పల్లిపాము జీవరత్నం మాదిగ, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.