BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 06:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్లపాడు, గాదెవారిగూడెం, ఊటుకూరులో ప్రతిజ్ఞ ఉద్యమానికి 15 ఏళ్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 06:32 PM
75 వీక్షణలు

పైడిమర్రి వెంకట సుబ్బారావుకు గుర్తింపు ఇవ్వాలని ప్రారంభమైన సంతకాల ఉద్యమం గుర్తుచేసుకున్న జన విజ్ఞాన వేదిక సభ్యులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని ఆర్లపాడు, గాదెవారిగూడెం, ఊటుకూరు గ్రామాల్లో “భారత దేశం నా మాతృభూమి” ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావుకు తగిన గుర్తింపు కల్పించాలని కోరుతూ ప్రారంభించిన ప్రతిజ్ఞ ఉద్యమానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్లపాడులో జరిగిన కార్యక్రమంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్ర పుస్తకాలను ఉపాధ్యాయులకు, జన విజ్ఞాన వేదిక సభ్యులు ఎం. రాం ప్రదీప్ అందజేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిజ్ఞ రచయిత సేవలను వివరించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. రామకృష్ణారావు, ఉపాధ్యాయ సిబ్బంది ఏ. కోటేశ్వరరావు, పి. కృష్ణయ్య, ఎం. అనసూయ తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా గాదెవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల సంఖ్యను 21 మందికి పెంచేందుకు విశేష కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. నవీన్‌ను ఘనంగా సన్మానించారు.

అనంతరం ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిషన్ మార్చ్–2027 కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల పరీక్షపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రామయ్య తదితరులు పాల్గొన్నారు.