BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 01 September 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణల పరిశీలన....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 05:13 PM
75 వీక్షణలు

కంభంపాడు ప్రధాన రహదారిపై ఆక్రమణల పరిశీలన.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత

కంభంపాడు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని ప్రధాన రహదారిపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, ఫుట్‌పాత్ ఆక్రమణలను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ మంగళవారం పరిశీలించారు.

గ్రామంలోని బస్ షెల్టర్, బస్సులు ఆగే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న అంశాలను ఆయన పరిశీలించారు. ఫుట్‌పాత్‌లపై వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను వెంటనే తొలగించి పాదచారులకు మార్గం అందుబాటులో ఉండేలా చూడాలని ఏ కొండూరు పోలీసు సిబ్బంది, తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బస్ షెల్టర్, బస్సులు నిలిచే ప్రాంతం, నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు, పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అనంతరం రహదారి పక్కన ఉన్న వాహనదారులు, దుకాణాల యజమానులతో మాట్లాడి ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని కోరారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని సూచించారు.