BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 05:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రైతులకు కొత్త నిబంధనలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 05:12 PM
100 వీక్షణలు

ఏపీలో రైతులకు కొత్త నిబంధనలు.. ఎరువుల కొనుగోళ్లకు భూమి రికార్డుల అనుసంధానం

అమరావతి: రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొనుగోళ్లలో కీలక మార్పులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై రైతులు కొనుగోలు చేసే ఎరువులను వారి భూమి వివరాలు, పంటల సాగు రికార్డులతో అనుసంధానం చేయనున్నారు.

కొత్త విధానం ప్రకారం ఐఎఫ్‌ఎంఎస్‌–అగ్రిస్టాక్‌ వ్యవస్థ ద్వారా రైతులు మొబైల్‌ యాప్‌లో ఎరువుల కోసం నమోదు చేసుకుంటే ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ జారీ అవుతుంది. రైతులు ఆ కోడ్‌ను ఎరువుల దుకాణంలో చూపించగా, వ్యాపారులు స్కాన్‌ చేసి రైతు భూమి వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులను అందించనున్నారు.

ఎరువుల రవాణాను జీపీఎస్‌ సాంకేతికతతో పర్యవేక్షించడం, సబ్సిడీ చెల్లింపులను డిజిటల్‌ విధానంలో ట్రాక్‌ చేయడం ద్వారా అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విధానం అమల్లోకి వస్తే అవసరమైన రైతులకు మాత్రమే ఎరువులు అందడంతో పాటు, మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.