BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 04:52 pm
Posted by : SIVA RAJ

NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
01 Sep, 2026 - 04:52 PM
49 వీక్షణలు

గుంటూరు: విజయవాడ పరిధిలో జాతీయ రహదారులకు సంబంధించిన కీలక సమస్యలు, పెండింగ్ పనులు, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ NHAI రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయవాడ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనుల స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న పనులు, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీపడకుండా, అవసరమైన సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు.