BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 05:42 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
01 Sep, 2026 - 05:42 PM
65 వీక్షణలు

ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు.

రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో శనిగరపు వెంకటేష్, నాయకులు బోనగిరి నాగరాజు, కడారి రాజు, శ్యామసుందర్ రెడ్డి, జంపాల ప్రవీణ్, రేషన్ డీలర్లు నాంపల్లి కవిత, సమ్మయ్య, కార్యదర్శి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.