BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 08:18 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
01 Sep, 2026 - 08:18 PM
159 వీక్షణలు

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత

మంచిర్యాల | N Today News

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండగా నిలిచారు.

దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన బి. శ్రీ చందన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు.

ఈ మేరకు మంజూరైన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శ్రీ చందన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితుల కారణంగా పేద కుటుంబాలు మెరుగైన వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులకు అండగా నిలుస్తోందన్నారు.

కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీ చందన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, సర్పంచ్ చుంచు నగేష్, ఉప సర్పంచ్ ముత్తే శంకరయ్య, వార్డు సభ్యుడు మహేష్, నాయకులు ఆకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.