BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 09:23 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
01 Sep, 2026 - 09:23 PM
86 వీక్షణలు

39 మంది లబ్ధిదారులకు రూ.11.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

ఖమ్మం జిల్లా | సత్తుపల్లి | Ntoday News

సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం వీఎం బంజర్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నాణ్యమైన సన్న బియ్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం పెనుబల్లి మండలానికి చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.11,59,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అందజేశారు. వైద్య చికిత్స తదితర అవసరాల కోసం మంజూరైన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు, బుక్క కృష్ణవేణి, సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుమర్తి విశ్వనాథ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు టేకులపల్లి శ్రీనివాసరెడ్డి, సీతారామారావు, చీకటి రామారావు, చిన్నస్వామి, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.