BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 09:45 pm
Posted by : కూనురు మధు

ట్రాక్టర్ పైనుంచి జారిపడి రైతు దుర్మరణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Sep, 2026 - 09:45 PM
493 వీక్షణలు

చిట్యాల| Ntoday News

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి జారిపడి టైరు కింద పడటంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పిట్టంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పిట్టంపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి కృష్ణా రెడ్డి (43, తండ్రి: లక్ష్మారెడ్డి) తన పొలం వద్ద ఉన్న ట్రాక్టర్‌ను, తాను కౌలుకు తీసుకున్న సింగిరెడ్డి యాదిరెడ్డి పొలంలో గుంటుక కొట్టడానికి తెల్లవారుజామున తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో పొలాల్లోకి వెళ్లే బాట నుంచి ట్రాక్టర్‌ను తిప్పుతుండగా, మట్టి గడ్డపైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు వాహనం పైనుంచి జారి కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ ఇంజన్ వెనుక టైరు తలపై నుంచి వెళ్లడంతో కృష్ణా రెడ్డికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య శోభ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల పోలీసు స్టేషన్ ఏఎస్ఐ ఎం.జానారెడ్డి తెలిపారు.