BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 10:26 pm
Posted by : SEETHA KIRAN KUMAR

1000 రోజుల్లో తెలంగాణ ప్రగతికి కొత్త బాట

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Sep, 2026 - 10:26 PM
48 వీక్షణలు

సంక్షేమం, అభివృద్ధితో ప్రజల గుండెల్లో కాంగ్రెస్: ఎంపీ కడియం కావ్య

హనుమకొండ | Ntoday News

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజుల ప్రజాపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వ 1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

రైతులు, మహిళలు, పేదలు, యువత సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ 1000 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

గత 32 నెలల్లో రైతుల కోసం ప్రభుత్వం రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కడియం కావ్య తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షల రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించామని చెప్పారు.

రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు విడుదల చేశామని, కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. సన్నబియ్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించడంతో పాటు ఉచిత విద్యుత్, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

యాసంగి సీజన్‌లో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీ పేర్కొన్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కడియం కావ్య అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటివరకు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా అయిందని తెలిపారు.

గృహజ్యోతి పథకం ద్వారా 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరిందన్నారు.

మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 4.50 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి అవకాశాలను కల్పిస్తున్నామని వివరించారు.

పేదలకు సంక్షేమం.. సామాజిక న్యాయానికి పెద్దపీట

పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ తెలిపారు. ఇప్పటివరకు 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి, మొత్తం 3.38 కోట్ల మందికి పీడీఎస్ ద్వారా ప్రయోజనం అందిస్తున్నామని చెప్పారు.

అలాగే 43 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పేదలు, అణగారిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కడియం కావ్య పేర్కొన్నారు.

1000 రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.