BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 07:54 pm
Posted by : BOYA SWAMY

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
01 Sep, 2026 - 07:54 PM
284 వీక్షణలు

ఉరుమడ్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సుమారు రూ.12 లక్షల ఆర్థిక సాయం

నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఉరుమడ్ల | సెప్టెంబర్ 1, 2026

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు రూ.12 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వారి నివాసాల వద్ద అందజేశారు. కేస జయలక్ష్మి, రాచమల్ల ముత్యాలు, రాచమల్ల బుచ్చయ్య, వెలిమినేటి రజిత, ఆనగంటి భాగ్యలక్ష్మితో పాటు చిట్యాల ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థిక సాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లబ్ధిదారులు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, ఆర్యవైశ్య జిల్లా మాజీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, మేడబోయిన శ్రీను, బొంగు శంకర్, నకిరేకంటి వెంకన్నతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.