BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 01 September 2026, 07:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెద్దకొమిరలో ఉపాధ్యాయుల ఆందోళన....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:52 PM
83 వీక్షణలు

పెద్దకొమిరలో ఉపాధ్యాయుల ఆందోళన.. మూడు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకొమిర గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేపట్టారు.

ఏపీ మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న అధ్యాపక బృందంతో పాటు అధ్యాపకేతర సిబ్బంది సుమారు 40 మందికి గత మూడు నెలలుగా జీతాల బిల్లులు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ గంపలగూడెం మండల యుటిఎఫ్ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ.. పాఠశాల ప్రిన్సిపాల్ డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతానికి వెళ్లడంతో జీతాల బిల్లులు పెట్టే వారు లేరనే కారణం చూపుతున్నారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు.

తక్షణమే జీతాల బిల్లులు నమోదు చేసి మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని కోరారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి ప్రిన్సిపాల్ హేమలతకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.