ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖలో 13 మంది అధికారులకు ఘన వీడ్కోలు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖలో 13 మంది అధికారులకు ఘన వీడ్కోలు
ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న 13 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ధి, అంకితభావంతో ప్రజలకు విశిష్ట సేవలు అందించిన పదవీ విరమణ పొందుతున్న అధికారులను డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె.జి.వి. సరిత అభినందించారు. పోలీస్ మర్యాదలతో శాలువాలు కప్పి సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.
పదవీ విరమణ పొందిన వారిలో సి.ఎ.ఓ. ఐ.వి.ఆర్. నాగవర్దన్, సబ్ ఇన్స్పెక్టర్లు జె. జ్ఞానదేవ్, ఎస్. సాయిబాబా, పి.ఎస్.ఎస్. రెడ్డి, ఎం. శ్రీనివాస ప్రసాద్, ఎం. శ్రీధర్, ఏఆర్‌ఎస్‌ఐలు జి.ఎస్.ఎన్. మూర్తి, బి. ప్రసాద్, సి.హెచ్. శివాజీ, హెడ్ కానిస్టేబుల్ బి.ఎన్.వి.కె.డి. ప్రసాద్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్. పాండు రంగయ్య, హోంగార్డులు కె. లక్ష్మీనారాయణ, పి. రమణ ఉన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజలకు రక్షణగా సేవలందించే అవకాశం దక్కడం గొప్ప విషయమన్నారు. పోలీస్ శాఖలో పనిచేయడం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం, బాధితులకు తక్షణ న్యాయం అందించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితుల్లోనూ జీవిత భాగస్వాములు, పిల్లలు అర్థం చేసుకోవడం వల్ల పోలీస్ జీవితం సంతృప్తికరంగా సాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 24 గంటలు విధుల్లో నిమగ్నమైన అధికారులు ఇకపై ఆరోగ్యంపై దృష్టి పెట్టి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, ప్రేమ్ కుమార్, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. సోమయ్య, సంఘ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.