BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 07:56 am
Posted by : కూనురు మధు

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సట్టు సైదులు

తెలంగాణ
/ నల్గొండ
01 Sep, 2026 - 07:56 AM
241 వీక్షణలు

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సట్టు సైదులు

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సట్టు సైదులు ఎన్నికయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన ప్రతినిధులతో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అధ్యక్ష పదవికి సట్టు సైదులు, రాంబాబు ప్యానళ్ల మధ్య పోటీ జరగగా.. సట్టు సైదులు ప్యానల్ 9 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. మొత్తం 49 మంది ప్రతినిధుల్లో సట్టు సైదులు ప్యానల్‌కు 29 ఓట్లు, రాంబాబు ప్యానల్‌కు 20 ఓట్లు పోలయ్యాయి. ఏఆర్ విభాగం నుంచి 13 మంది, సివిల్ విభాగం నుంచి 30 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు. వీరిలో 13 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ వివరాలు: ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి బాలకృష్ణ, కోశాధికారిగా కాశిరెడ్డి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఇరిగి రవి, కరుణాకర్, సంయుక్త కార్యదర్శిగా కోటా సాయిరాం, కార్యనిర్వాహక కార్యదర్శిగా చిన్నపంగు వినోద్ ఎన్నికయ్యారు. సభ్యులుగా అజ్మీర్ రమేష్, నాగజ్యోతి, భాస్కర్, అలకుంట్ల సుధాకర్, దాచు శ్రీహరి, వెంకన్న ఎన్నికయ్యారు. మరో ఇద్దరు కోఆప్షన్ సభ్యులను నూతన కమిటీ తొలి సమావేశంలో ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నూతన కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతన కమిటీ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.