BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 01 September 2026, 08:17 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Sep, 2026 - 08:17 AM
61 వీక్షణలు

బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ....

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు: పట్టణంలోని బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు జనరల్ సెక్రటరీ ఈ.ఎస్. గంగులచారి పాల్గొని అర్హులైన పెన్షన్‌దారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.

అలాగే హనుమంతరాయనిదిన్నె ప్రాంతంలోనూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకం ద్వారా ప్రతి నెలా ఆర్థిక సహాయం అందుతోంది.

ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది పెన్షన్‌దారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2,693.90 కోట్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా గంగులచారి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ సొమ్ము వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు నెలవారీ అవసరాల్లో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.