BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 07:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ.. నాణ్యమైన పరిష్కారాలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:56 AM
57 వీక్షణలు

విజయవాడ:

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, ఐఏఎస్‌తో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి 161 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందజేసిన ఫిర్యాదులకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల సంతృప్తి, ఐవీఆర్ఎస్ అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కార నాణ్యత ఆధారంగా ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేలా అధికారులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అలాగే స్వచ్ఛ ఆంధ్ర–2026 అవార్డుల్లో జిల్లాకు మరిన్ని పురస్కారాలు సాధించే లక్ష్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.