ఎలికట్టేలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
ఎలికట్టేలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
అణగారిన వర్గాల హక్కులు, రాజ్యాధికారం కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ మాదిగ పిలుపునిచ్చారు. చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉస్కిల రవి మాదిగ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎరసాని గోపాల్ మాదిగ హాజరై మాట్లాడారు. ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడంతోపాటు సామాజిక అసమానతలు, లింగ వివక్ష లేని సమసమాజ నిర్మాణం కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీడిత వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం చేసేందుకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు పెరిక లింగస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొలిమేర దశరథ మాదిగ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ ఎలికట్టే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెరిక రమేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా చుక్క కృష్ణ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ఉప్పలపల్లి నరసింహ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గా ఉస్కిల బిక్షం మాదిగ, చుక్క సురేష్ మాదిగ, చుక్క బిక్షం మాదిగ. కార్యదర్శులు పెరిక సందీప్ మాదిగ, పెరిక శివ మాదిగ, పెరిక సాయి గణేష్ మాదిగ. సంయుక్త కార్యదర్శులు గా పెరిక విజయ్ మాదిగ, పెరిక వెంకట్ మాదిగ, పెరిక సైదులు మాదిగ. ప్రచార కార్యదర్శులు గా పిల్లి రాజు మాదిగ, పెరిక సుధాకర్ మాదిగ, పెరిక రమేష్ మాదిగ. గౌరవ సలహాదారులు గా చుక్క నరసింహ మాదిగ, ఉస్కిల బిక్షం మాదిగ, పిల్లి నరసింహ మాదిగ, ఉస్కిల ఎల్లయ్య మాదిగ, పెరిక నరసింహ