BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 02 September 2026, 07:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడిపాడులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 07:42 AM
102 వీక్షణలు

గుడిపాడులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు.. దోమల బెడదతో అనారోగ్యం పాలవుతున్న కుటుంబం

నూజివీడు / గుడిపాడు, సెప్టెంబర్ 02

ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలోని మసీదు రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఇతర కీటకాలు పెరిగి వ్యాధుల ముప్పు ఏర్పడుతోందని నూరు బాషా షకూర్ బి ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన కాలువల వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలో ఉపయోగించిన నీరు, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోతున్నాయని తెలిపారు. నిలిచిపోయిన మురుగునీటిలో దోమలు, కీటకాలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

తమ కుటుంబ సభ్యులందరికీ దోమల బెడదతో జ్వరాలు వస్తున్నాయని, శుభ్రమైన వాతావరణం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని షకూర్ బి తెలిపారు. సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది.