BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 02 September 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో జయహో బీసీ కార్యక్రమం.. అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 06:08 AM
13 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు:

తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. 26 నెలల క్రితం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

తనకంటే ముందు రక్షణ నిధి పదేళ్లు, దిరసం పద్మజ్యోతి ఐదేళ్లు, స్వామిదాస్ 15 ఏళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారని, 26 నెలల కాలంలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేశానా లేదా ప్రజలే నిర్ణయించాలని అన్నారు.

తిరువూరు నియోజకవర్గంలో నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసి విజయం సాధించామని చెప్పారు. తిరువూరు పరిస్థితులపై సీఎం చంద్రబాబుకు అవగాహన ఉండటంతో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అధికంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

కట్టలేరు బ్రిడ్జికి రూ.55 కోట్లు

వినగడప కట్టలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిశానని, తిరువూరు నియోజకవర్గానికి రూ.55 కోట్లు కేటాయించారని తెలిపారు. పరిపాలనా అనుమతులు పూర్తయ్యాయని, ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని వివరించారు.

గత నెల రోజుల్లో ముఖ్యమంత్రిని మూడుసార్లు కలిసి బ్రిడ్జి విషయాన్ని గుర్తు చేశానని, అసెంబ్లీలో కూడా దీనిపై ప్రస్తావించానని చెప్పారు. "అడగనిదే అమ్మాయికి అన్నం పెట్టరు" అన్న సామెతను గుర్తు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత

26 నెలల కాలంలో రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, కోకిలంపాడు రోడ్డు, సూర్య రెస్టారెంట్ రోడ్డు వంటి అనేక రహదారులను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

సెప్టెంబర్ 1న పేదలకు రూ.4 వేలు, రూ.6 వేలు, రూ.10 వేల చొప్పున పెన్షన్లు పంపిణీ చేశామని చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో దాదాపు రూ.360 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

ఏ కొండూరు మండలంలో కిడ్నీ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, శుద్ధమైన కృష్ణా జలాల పథకం 2014లో ప్రారంభమైనా వైఎస్ జగన్ పాలనలో నిలిపివేశారని విమర్శించారు.

బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది

ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు వారి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా శాసనసభలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా అమలు చేశామని తెలిపారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలకు 24 శాతం మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. 1993లో ఎన్టీఆర్ టీడీపీ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్లే నేడు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణారావు, కేఈ కృష్ణమూర్తి వంటి నాయకులు ఎదిగారని అన్నారు.

"నాడు ఎన్టీఆర్ నారు పోస్తే.. నేడు చంద్రబాబు నీరు పోశారు" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ వంటి అనేక మంది బీసీ నాయకులు ఉన్నారని తెలిపారు.

కార్యకర్తలే పార్టీకి బలం

బీసీలను పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమై ఓడిపోయిందని అన్నారు. బీసీలకు ఎంపీపీ, జడ్పీటీసీ తదితర ఉన్నత పదవుల్లో అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కరుడుగట్టిన కార్యకర్తలని, నాయకులు మారినా కార్యకర్తలు పార్టీని వదలలేదని చెప్పారు. గతంలో ఎంపీగా పనిచేసిన కేశినేని నాని కార్యకర్తలపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు.

తిరువూరులో స్వామిదాస్, సుధారాణి మాత్రమే ఇతర పార్టీల్లోకి వెళ్లారని, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని అన్నారు.

కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు

తాను ఐదేళ్లు పోరాటం చేసిన తర్వాతే తిరువూరుకు వచ్చానని, ఎంపీ కేశినేని శివనాథ్ సూచనతో ఇక్కడికి వచ్చానని తెలిపారు. క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలను గుర్తించి రాష్ట్రస్థాయిలో నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

10 ఓట్లు, 100 ఓట్లు వేసి గెలిపించే ప్రతి కార్యకర్త నాయకుడేనని చెప్పారు. ఎన్నికల సమయంలో తనకు పరిచయం ఉన్నవారు ఆర్థిక సహాయం చేశారని, వచ్చిన ప్రతి రూపాయిని పార్టీ కోసం ఖర్చు చేశానని తెలిపారు.

తనను విమర్శించిన వారిని కూడా తాను ఎప్పుడూ తిట్టలేదని, తన పనితీరే సమాధానం చెబుతుందని అన్నారు. 26 నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీల వారు తనను కానీ, తనతో ఉన్న వారిని కానీ విమర్శించే పరిస్థితి రాలేదని చెప్పారు.

తప్పు చేస్తే తన దగ్గర ఉన్న వారిని కూడా ఉపేక్షించనని, అందుకే తన వద్ద పనిచేసేవారు బాధ్యతగా ఉంటారని అన్నారు.

73 పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూటమి జెండా ఎగరాలి

రాబోయే ఎన్నికల్లో 73 పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కూటమి జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడం సహజమని, సొంత పార్టీ వారు ఇబ్బంది పెడితే బాధ కలుగుతుందని అన్నారు.

"ఎన్నికల ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను" అని పేర్కొన్నారు. చివరగా ప్రభాస్ సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ "మహా అయితే ప్రేమిద్దాం డూడ్" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.