BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 02 September 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేసీఆర్ కోసం మూడేళ్లలో కోట్ల ఖర్చు.. రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 06:08 AM
76 వీక్షణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలకు కౌంటర్‌గా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ప్రజా సమస్యలపై స్పందించకుండా ప్రతిపక్ష నేత పదవిలో కొనసాగడం సరికాదని, వెంటనే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

వెయ్యి రోజుల్లో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి: రేవంత్

అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన నూతన వంతెనను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత వెయ్యి రోజుల్లో కేసీఆర్ ప్రజల కోసం ఒక్కరోజు కూడా బయటకు రాలేదని ఆరోపించారు.

ఒక ఉద్యోగి ఏడాది పాటు పని చేయకపోతే తొలగిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం పదవిలో కొనసాగుతూ ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్నారని విమర్శించారు.

జీతం, భద్రత కోసం రూ.24 కోట్లకు పైగా ఖర్చు: సీఎం

కేసీఆర్‌కు గత మూడేళ్లలో జీతంగా రూ.1.84 కోట్లు చెల్లించామని, వాహనాలు, భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం రూ.22.24 కోట్లకు పైగా ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇంత ఖర్చు చేస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయలేని పరిస్థితిలో ఉంటే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.