BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 02 September 2026, 01:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పుట్రేలలో రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో ఏ. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 01:49 PM
56 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట: భూముల రీ-సర్వే పనులను అధికారులు పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో బుధవారం జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ, భూముల సరిహద్దుల గుర్తింపు, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆర్డీవో సమీక్షించారు. రీ-సర్వే పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రైతులతో మాట్లాడిన ఆర్డీవో ఏ. కుమార్, రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న వివరాలను సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రీ-సర్వే ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని కోరారు.

భూములకు సంబంధించి ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రీ-సర్వే పనులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఏ. కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.