BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 02 September 2026, 03:42 pm
Posted by : ADARI RAMA PRASAD

వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
02 Sep, 2026 - 03:42 PM
74 వీక్షణలు

మునగపాకలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బొడ్డేడ ప్రసాద్

మునగపాక | Ntoday News

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాకలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మునగపాక గ్రామంలోని నందీశ్వర ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయనను తెలుగు ప్రజలు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.

వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తర్వాత అదే స్థాయిలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కుటుంబం పనిచేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆడారి అచ్చినాయుడు, ఎంపీపీ ముల్లెట్ కృష్ణవేణి నారాయణరావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.