BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 11:28 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో యువత జోష్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Sep, 2026 - 11:28 PM
58 వీక్షణలు

500 మందితో భారీ బైక్ ర్యాలీ.. ‘జై కొట్టు’ జనసేన యువజన విభాగం లోగో ఆవిష్కరణ

పుంగనూరు | Ntoday News

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పుంగనూరులో జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

జనసేన పార్టీ కార్యాలయం నుంచి ట్రావెలర్స్ బంగ్లా వరకు సుమారు 500 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోకుల్ సర్కిల్‌లో కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగానికి సంబంధించిన ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. యువతకు పవన్ కల్యాణ్ సందేశాన్ని అందిస్తూ, యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పుంగనూరు జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సహకరించిన పుంగనూరు పోలీసు అధికారులకు జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.