కాకుమాను రాజశేఖర్‌కు దద్దాల నారాయణ యాదవ్ నివాళి
ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ పార్థివదేహానికి కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ నివాళులర్పించారు. శుక్రవారం ఒంగోలులో రాజశేఖర్ పార్థివదేహాన్ని సందర్శించిన ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ రాజశేఖర్ ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, ముఖ్యంగా ఎస్సీ, ప్రచార విభాగాలకు తీరని లోటని పేర్కొన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజశేఖర్ ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ, పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేశారని పేర్కొన్నారు.
రాజశేఖర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయని దద్దాల నారాయణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఒక ముఖ్యమైన నాయకుడిని కోల్పోయిందని అన్నారు.
కాకుమాను రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు YV సుబ్బారెడ్డి గారు, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు,దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు,బూచేపల్లి వెంకాయమ్మ గారు,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మనంద రెడ్డి గారు,మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున గారు, ఆదిమూలపు సురేష్ గారు, యర్రగొండపాలెం MLA తాటిపత్రి చంద్ర శేఖర్ గారు, మాజీ MLA అన్నా రాంబాబు గారు, కె. పి నాగార్జున రెడ్డి గారు, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గుంటక తిరుపతిరెడ్డి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.